రైతులకు బీజేపీ అండగా ఉంటుంది.. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు.
రైతులకు బీజేపీ అండగా ఉంటుంది.. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు.
Bjp


వికారాబాద్, 25 మే (హి.స.)

రైతులకు బీజేపీ ఎల్లవేళలా అండగా

ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అన్నారు. సోమవారం వారు వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడి వారికి ధాన్యం కొనుగోలులో ఎదురైన సమస్యలను, కష్టలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు, వడ్లకొనుగోలు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తక్షణమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయంటూ ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు.

క్షేత్రస్థాయిలో ఇంకా 75 శాతానికి పైగా వరి ధాన్యం కొనుగోళ్లు జరగకుండా కల్లాల్లోనే మురిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల్లో వర్షాలు పడితే.. తడిసిన ధాన్యాన్ని కొనే నాథుడే ఉండడని, అన్నదాతలు దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల్లో హమాలీ ఖర్చులు, గన్నీ బ్యాగుల డబ్బులు రైతుల నుంచే వసూలు చేస్తున్నారని.. ఒక్కో బస్తాకు ఏకంగా 4 కిలోల అదనపు తరుగు తీస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వారిని గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతు పండించిన చివరి గింజ కొనుగోలు చేసే వరకు బీజేపీ తరఫున 'రైతు గోస బిజెపి భరోసా' యాత్రతో అండగా నిలబడతామని, ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande