కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
Cm


హైదరాబాద్, 25 మే (హి.స.)

రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, తాజా

రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాల పెంపు (Minimum Wages Hike) చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ ఎంఎల్సీ సత్యం, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ పక్షం నుంచి రాజ్యసభసభ్యుడు, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఈ భేటీలో భాగస్వామ్యులయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోయినా అన్నదాతలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో ఈసారి మొక్కజొన్న దిగుబడి చాలా అద్భుతంగా వచ్చిందని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం మొక్కజొన్నలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. అటు ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందడం లేదని కామెంట్ చేశారు. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆర్థిక నష్టం వచ్చినా సరే.. రైతుల ప్రయోజనాలే పరమావధిగా మొక్కజొన్న, ధాన్యం మొత్తాన్ని మేమే కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు సకాలంలో డబ్బు ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande