ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం సహాయనిధి గొప్ప ఆధారం.. ఎమ్మెల్యే బాలు నాయక్
ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం సహాయనిధి గొప్ప ఆధారం.. ఎమ్మెల్యే బాలు నాయక్
MLA


నల్గొండ, 25 మే (హి.స.)

చరిత్రలో నిలిచేవి మాటలు కాదు, ప్రజల జీవితాల్లో తెచ్చే వెలుగులు.. పాలన అంటే అధికార గదుల్లో ఆగిపోవడం కాదు, ప్రతి గడపకు చేరడం అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం, వ్యవసాయ మార్కెట్ యార్డులో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బాలు నాయక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఇప్పటివరకు దేవరకొండ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద రూ.17 కోట్లు, ఎల్బీసీ కింద రూ.9 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ...ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం సహాయనిధి గొప్ప ఆధారంగా నిలుస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా కృషి చేస్తున్నాం. పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసమే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు. ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలను సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలి” అని సూచించారు. రాబోయే పథకాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మక 'ఇందిరమ్మ జీవిత భీమా' పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కులమతాలకు అతీతంగా 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల భీమా రక్షణ కల్పిస్తాం. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సోలార్ పవర్ ప్లాంట్ల కేటాయింపు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ. లక్ష కోట్లకు పెంచుతాం” అని వివరించారు. “సన్నబియ్యం పంపిణీ, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపిస్తున్నాం” అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande