
కాసిపేట 25 మే (హి.స.)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకేనపల్లి శివారులోని సోమగూడెం రహదారి పక్కన గల సర్వే నెంబర్ 2పైక గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ట్రాక్టర్ తో చదును చేస్తుండగా లంబాడి తండా(కే) గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని కొంత మంది పట్టాలు ఉన్నాయని వస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా ఇది ప్రభుత్వ భూమిగా ఉందని, రెవెన్యూ శాఖ బోర్డులు కూడా పెట్టారని గ్రామస్తులు పేర్కొన్నారు.ర్వే నెంబర్ పెద్దది కావడంతో పొజిషన్ వేరే దగ్గర ఉండగా రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమినే తమ భూమిగా చూపిస్తున్నారని, ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని పేర్కొన్నారు. బెల్లంపల్లి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జీపీవోలు ప్రతిభ, దాస్ లు వచ్చి విచారణ చేపట్టారు. విచారణ చేసి సర్వే పూర్తి అయ్యే వరకు ఎటువంటి పనులు చేయరాదని సూచించారు. లంబాడితాండ(కే) సర్పంచ్ బోడ బలరాం ఆధ్వర్యంలో గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు. ఇదిలా ఉండగా తమకు అన్ని పత్రాలు ఉన్నాయని మరో వర్గం వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi