ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తి.. మంత్రి పొన్నం ప్రభాకర్.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తి.. మంత్రి పొన్నం ప్రభాకర్.
Ponnam


హైదరాబాద్, 27 మే (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్

నగర రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. కూకట్పల్లి డిపోకు కేటాయించిన 60 సరికొత్త ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో హైదరాబాద్ నగరం కాలుష్యమయం కాకూడదనే సుదూర లక్ష్యంతోనే ప్రభుత్వం ఈవీ బస్సులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల రవాణా వ్యవస్థపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈవీ బస్సుల వినియోగం ద్వారా ఇంధన ఖర్చులను తగ్గించుకుని ఆర్థిక భారం నుంచి బయటపడొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో టీజీఎస్ఆర్టీసీ (TGS RTC) కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande