
కరీంనగర్, 27 మే (హి.స.)
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. వడ్ల పైసలన్నీ కేంద్రమే ఇస్తుంటే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా బొమ్మకల్ ఐకేపీ కేంద్రాన్ని సందర్శించించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వర్షానికి తడిసిన వడ్లను బండి సంజయ్కు చూపిస్తూ రైతులు వాపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి.. నెల రోజులుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం వడ్లు కొనకుండా రైతులను అరిగోస పెడుతున్నారని సీఎం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయమే లేదని ఆరోపించారు. తలో మాట చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తడిసిన ధాన్యం పేరుతో పెద్ద ఎత్తున కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని తెలంగాణ వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ విమర్శించారు. పంట నష్టపోతే పరిహారమిచ్చే దిక్కు లేదు. పండించిన వడ్లను కొనకపోతే... రైతులకు ఇంకేం మేలు చేస్తారు? అని నిలదీశారు. నెలాఖరు వరకు వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని లేదంటే దేనికైనా సిద్దం అని హెచ్చరించారు. అసలు వడ్లను కొంటారా? లేదా? మీకు చేతగాకపోతే అదే విషయాన్ని కేంద్రానికి సీఎం లేఖ రాయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు