అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్ హైమావతి
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్ హైమావతి
Collector


సిద్దిపేట, 27 మే (హి.స.)

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి అన్నారు. సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కే. హైమావతి మాట్లాడుతూ జిల్లాలో 2024-25 రబీ సీజన్లో 3 లక్షల 81 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ సీజన్లో సైతం 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కోసం 427 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మరో లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande