రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం వద్దు కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం వద్దు కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
collector-dr-a-siri-and-mla-dr-parthasarathy-inspect-accident-bl


ఆదోని, 29 మే (హి.స.)కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంయుక్త తనిఖీలు.

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గుర్తించిన బ్లాక్ స్పాట్ ల వద్ద అవసరమైన ఏర్పాట్లు, మరమ్మతులు, నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ రోజు ఉదయం ఆదోని పట్టణంలోని నూతన బైపాస్ రోడ్ పరిధిలో ఉన్న బ్లాక్ స్పాట్లను జిల్లా కలెక్టర్ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే, రవాణా, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, ప్రజల ప్రాణ రక్షణ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆదోని వై జంక్షన్ నుండి ఆలూరు బైపాస్ వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర నూతన రహదారి నిర్మాణం చేపట్టినప్పటికీ, ఇంకా కొన్ని కీలకమైన పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.

ముఖ్యంగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పనులు, వర్షపు నీటి పారుదల కోసం సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్ తీగల మార్పిడి, రోడ్డు భద్రత సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, సైడ్ సిగ్నల్స్, స్పీడ్ వార్నింగ్ బోర్డులు వంటి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande