
హైదరాబాద్, 30 మే (హి.స.)
ధాన్యం కొనుగోలుకు కేంద్రం
సహకరించడం లేదని అయినా రైతులకు ఇబ్బంది లేకుండా మేమే కొంటున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ఆరోపణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు. ధాన్యం సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ధాన్యం తీసుకోదన్నారు. హైదరాబాద్లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మీకు చేతగాక కేంద్రంపై విమర్శలా అని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదని ప్రభుత్వం దృష్టంతా కమీషన్లు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ పై ఉందని ఆరోపించారు. మేం యాత్ర చేసే వరకూ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని సమస్య కేవలం తెలంగాణలో మాత్రమే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. పొరుగున ఉన్న ఏపీలో అధికారులు సమన్వయం ప్రభుత్వం, చేసుకుంటున్నారని చెప్పారు. గన్నీ బ్యాగులు సరఫరా చేయలేని దురదృష్టకర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని వీటిని ఓ ఆర్నెళ్ల ముందు వీటిని తెచ్చుకుంటే ఏం రోగం వచ్చిందని మండిపడ్డారు.
ఇవాళి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొనుగోలు కోటా పూర్తి కాలేదని అలాంటిది మమ్మల్ని విమర్శించే నైతిక బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడిదన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైనసన్నబియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా సరఫరా చేస్తూ అక్కడి నుంచి నాసిరకమైన సన్ని బియ్యం దిగుమతి చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. వాటినే రేషన్ కార్డు లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి ఆశీస్సులతో ఇదంతా జరుగుతోందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యంలో మోసం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమాషా అయిపోయిందని మాటకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా మారిందన్నారు. వీళ్లు మాత్రమే నీతిగా పని చేస్తారనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతు డిస్కం అంశం తన దృష్టికి రాలేదన్నారు. రబీ సీజన్కు సబ్సిడీ ఎందకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు