ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు.. హోటళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు.. హోటళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
Municipal commissioner


మెదక్, 30 మే (హి.స.)

హోటళ్లలో వండే ఆహార పదార్థాలలో

నాణ్యత లోపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ హెచ్చరించారు. శనివారం నర్సాపూర్ మున్సిపాలిటీలో గల వివిధ హోటళ్లను మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంటలలో నాణ్యమైన వస్తువులు, పదార్థాలు వాడాలని సూచించారు. అలాగే వంట చేసే విధానం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. పాత ఆహారాన్ని మళ్లీ వేడి చేసి వినియోగదారులకు అమ్మడం లాంటి చర్యలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇంచార్జ్ ఉదయ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande