విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలి.. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలి.. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్
Collector


నాగర్ కర్నూల్, 30 మే (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు

మండల పరిధిలోని పోల్కంపల్లి,

వంగూరు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనాల పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారo క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణం, తరగతి గదులు, లైబ్రరీ, ఆటస్థలాలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతు లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని, పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యా ర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న ఈ విద్యాసంస్థల్లో ప్రతి నిర్మాణం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ సామగ్రి నాణ్యత, భవనాల భద్రతా ప్రమాణాలు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తరగతి గదుల రూపకల్పన వంటి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంశాలపై

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అత్యాధునిక విద్యా వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. పాఠశాలల పునఃప్రారంభసమయానికి నిర్మాణ పనులు పూర్తికాకపోతే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రారంభం నాటికి అన్ని తరగతి గదులు, లైబ్రరీ, ఆటస్థలాలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశు భ్రమైన, సౌకర్యవంతమైన విద్యా వాతావ రణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande