వారం రోజుల్లో ధాన్యం తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలి: నిర్మల్ జిల్లా కలెక్టర్
వారం రోజుల్లో ధాన్యం తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలి: నిర్మల్ జిల్లా కలెక్టర్
Collector


నిర్మల్, 30 మే (హి.స.)

వర్షాకాలం సమీపిస్తున్నందున వారం

రోజుల్లో ధాన్యం తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. శనివారం ఉదయం లోకేశ్వరం మండలంలోని సాథ్ గాం సమీపంలో గల రైస్ మిల్లుతో పాటు నగర్ ప్రాంతంలోని గోదాములను పరిశీలించారు. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం నిల్వ చేయడానికి అవసరమైతే అదనపు గోదాములను సమకూర్చుకోవాలని ధాన్యం రవాణా కోసం లారీలను సమకూర్చుకోవాలని సూచించారు.సాథ్ గాం రైస్ మిల్లులో సీఎంఆర్ వివరాలను రైస్ మిల్లు యజమాని రాజశేఖర్ ను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.వారం రోజుల తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ధాన్యం ఉండకూడదని సూచించారు. సూచించారు. ఆయనతోపాటు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారి సుధాకర్, లోకేశ్వరం తహసీల్దార్ సూర్యారావు, తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande