
హైదరాబాద్, 31 మే (హి.స.)
:జూన్ నెలలో కొత్తగా 5606 మందికి స్పౌజ్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేసినట్లు సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 1న 62,34,445 మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2728 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్తో కలుపుకుని ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో రూ.65,886 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్