
అమరావతి, 31 మే (హి.స.)
మన్యంలో తాగునీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మారుమూల గ్రామాల్లో ఊటలు సైతం ఎండిపోతున్నాయి. పెదబయలు మండలం మారుమూల బొంగరం పంచాయతీ తీములవార గ్రామంలో కుళాయిలు పాడవడంతో గ్రామస్థులకు ఊటనీరే దిక్కవుతోంది. ఇంకిపోతున్న ఊట వద్ద బిందెడు నీరు పట్టడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఉపయోగం లేకపోయిందని, ఇప్పటికైనా స్పందించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు బూడిద మాధవరావు, బాబూజీ, కిషోర్, గ్రామస్థులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ