అనకాపల్లి లో యదేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు
అనకాపల్లి లో యదేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు
అనకాపల్లి లో యదేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు


అనకాపల్లి, 31 మే (హి.స.)

- : ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులతోపాటు పలువురు పెద్దలు ప్రభుత్వ భూములను ఆక్రమించారు. కూటమి ప్రభుత్వంలోనూ వారి హవానే నడుస్తోంది. కొన్నాళ్ల కిందట రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డుల్లో పేర్లు నమోదు చేయించారు. తర్వాత భూమిని చదునుచేసి కొబ్బరి, మామిడి మొక్కలు నాటారు. ఇటీవల అందులో బోరు తవ్వించారు. విద్యుత్తు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande