డిజిటల్ హెల్త్ రంగంలో విప్లవం.. 'స్వస్థ భారత్' పోర్టల్ను ఆవిష్కరించిన కేంద్రం
డిజిటల్ హెల్త్ రంగంలో విప్లవం.. 'స్వస్థ భారత్' పోర్టల్ను ఆవిష్కరించిన కేంద్రం
Swasta


న్యూఢిల్లీ, 06 మే (హి.స.)

భారతదేశ డిజిటల్ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా విడివిడిగా ఉన్న ఆరోగ్య విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ 'స్వస్థ భారత్' (Swasth Bharat) పోర్టల్ను ప్రారంభించింది. ఇది వివిధ ఆరోగ్య కార్యక్రమాలను ఏకీకృతం చేసే వన్-స్టాప్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. ఈ పోర్టల్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ భారం తగ్గడమే కాకుండా, డేటా సేకరణలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సరికొత్త పోర్టల్ ద్వారా డేటా ఎంట్రీ లో డూప్లికేషన్ (పునరావృతం) సమస్య తొలగిపోనుంది. ఫలితంగా నివేదికలు త్వరగా అందుతాయి, ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు వేగంగా తీసుకునే వీలుంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ పోర్టల్, 'అభా' (ABHA) ఐడీతో అనుసంధానం చేయబడింది. దీనివల్ల ఆరోగ్య సమాచార మార్పిడి మరింత సురక్షితంగా మారుతుంది. ఈ వ్యవస్థ వల్ల మౌలిక సదుపాయాలపై భారం 20-30% తగ్గుతుందని, హెచ్ఎర్, డేటా ఎంట్రీ పనుల్లో 20-40% సామర్థ్యం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande