
నిర్మల్, 13 జూన్ (హి.స.)
తన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు
అందించే లక్ష్యంతో కాంగ్రెస్ నేత శ్రీహరిరావు, ఆయన సతీమణి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్మల్ పట్టణంలో ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కూచాడి సత్యమ్మ ప్రకాశావు పేరిట ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిర్మల్లోనే కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రారంభ దశలోనే కంటి సంబంధిత సమస్యలను గుర్తించి తగిన వైద్యం పొందవచ్చని తెలిపారు. క్లిష్టతరమైన నేత్ర సమస్యలు ఉన్నవారు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిపుణుల సేవలను పొందేలా ఈ కేంద్రం వారధిగా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..