మెట్రోపై రగడ.. ఐఆర్ఎఫ్సీ రుణాలకు సాంకేతిక ఇబ్బందులున్నాయి: కిషన్ రెడ్డి
మెట్రోపై రగడ.. ఐఆర్ఎఫ్సీ రుణాలకు సాంకేతిక ఇబ్బందులున్నాయి: కిషన్ రెడ్డి
kishan


హైదరాబాద్, 16 జూన్ (హి.స.)

హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్రం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఖండించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో రేవంత్ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 అమలుకు కేంద్రం రూ.1,200 కోట్లు అందించిందని వెల్లడించారు. మెట్రో విస్తరణ కోసం మరింత చురుగ్గా పనిచేయాలని తానే రేవంత్రెడ్డికి లేఖ రాశానన్నారు. ఐఆర్ఎఫ్సీ ద్వారా రుణం పొందేందుకు కూడా కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. ఐఆర్ఎఫ్సీ రూ.13 వేల కోట్ల రుణ ప్రతిపాదన విషయంలో కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని తెలిపారు. వాటిని కేంద్రంతో చర్చించి పరిష్కరించుకోవాల్సింది పోయి రాజకీయ విమర్శలకు దిగడం సరికాదన్నారు. ఆ సమస్యను తనపై నెట్టేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande