
కామారెడ్డి, 21 జూన్ (హి.స.)
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సమయానికి యూరియా బస్తాలు దొరకడం లేదని, యాప్లో సమాచారం అస్తవ్యస్తంగా ఉంటుందని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా యాప్లో పెట్టిన సమాచారాన్ని గ్రామస్తులకు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయడం లేదని తద్వారా యూరియా దొరకడం లేదని రోడ్డుపై నిరసన తెలిపారు.యాప్ విధానం రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi