రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం : కేటీఆర్
రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం : కేటీఆర్
రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం : కేటీఆర్


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాఫియా శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు. దండుపాళ్యం ముఠాకు నాయకుడిలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుంటే.. ఆయన ఆధ్వర్యంలో ‘దోచుకో.. దాచుకో’అన్నట్లుగా కాంగ్రెస్ మంత్రులంతా కలిసి మాఫియాలు, స్కామ్లు చేస్తున్నారని మండిపడ్డారు.

అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే.. ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు పోతడు రా ఈయన అని అందరూ తల పట్టుకొని కూర్చున్నరు. ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది.. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుందన్నారు.

శంషాబాద్ నుండి ఒక వ్యక్తి నాకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చాడు. మా తాతల నాటి భూమిని నిషేధిత జాబితాలో పెట్టి, ఇదేంటి అని రాజకీయ నాయకులను అడిగితే ఎకరానికి కోటి రూపాయలు ఇస్తే నిషేధిత జాబితా నుండి తీసేస్తామని చెప్తున్నారని తన బాధ చెప్పుకున్నాడని కేటీఆర్ అన్నారు. రెండేళ్లు నా భూమిని ఎలాగైనా కాపాడుకుంటాను, మీరు వచ్చాక వాళ్ల భరతం పట్టాలి సార్ అని అతను నా దగ్గర వాపోయాడని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande