వెల్దుర్తిలో యోగా సందడి.. పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్!
వెల్దుర్తి ,21 జూన్ (హి.స.) , 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ఉప
వెల్దుర్తిలో యోగా సందడి.. పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్!


వెల్దుర్తి ,21 జూన్ (హి.స.) , 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి యోగా ఆసనాలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగ అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సనాతన జీవన విధానమని పేర్కొన్నారు. వేల సంవత్సరాల క్రితమే భారత ఋషులు మానవాళి ఆరోగ్యం కోసం అందించిన ఈ మహోన్నత సంప్రదాయం నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందన్నారు. భారతదేశ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు.

నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు. ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి వ్యాధులను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల చదువులో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోగలరని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధి చెందిన సమాజానికి పునాది అని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి కుటుంబం యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహిస్తోందని, యోగా ద్వారా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande