రాజన్న ఆలయం వద్ద జూదంతో భక్తుల నిలువు దోపిడీ.. అమాయక భక్తులే టార్గెట్
రాజన్న ఆలయం వద్ద జూదంతో భక్తుల నిలువు దోపిడీ.. అమాయక భక్తులే టార్గెట్
రాజన్న ఆలయం వద్ద జూదంతో భక్తుల నిలువు దోపిడీ.. అమాయక భక్తులే టార్గెట్


వేములవాడ, 21 జూన్ (హి.స.)

వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జారుకుని మరోచోట జూదం నిర్వహిస్తూ వేలాది రూపాయలను కొల్లగొడుతున్న కనీస పర్యవేక్షణ లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఇక శనివారం రాత్రి వరంగల్ జిల్లా నుండి కుటుంబం స్వామి వారిని దర్శించుకునేందుకు వేములవాడకు వచ్చారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్నాక కుటుంబ సభ్యుల్లోని ఒకరు గుడి చెరువు పార్కింగ్ స్థలంలో నిర్వహిస్తున్న ఆటల వైపు వెళ్లాడు.

అయితే ఇక్కడ రంగురంగుల బిల్లలతో జూదం నిర్వహిస్తున్నారు. ఇక భక్తుల రద్దీగా ఉండే ఆది సోమవారాలలో జాతర గ్రౌండ్, ఓపెన్ పార్కింగ్ స్థలం ప్రాంతాలలో రంగు బిళ్ళల మీద జూదం జరుగుతోంది. బిళ్ళ మీద ఎంత పెడితే ఆ బిళ్ళ వస్తే అంతకు నగదు రెట్టింపు ఇస్తూ వారిని వలలో వేసుకుంటున్నారు. 100 రూపాయలతో మొదలైన ఆట 5వేల రూపాయల వరకు చేరుతుండగా మోసానికి పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదే తరహాలో ఆట ఆడుతూ ఏకంగా ఓ వ్యక్తి సుమారు రూ.5వేలు పోగొట్టుకున్నాడు. దీంతో నగదు పోయిన విషయం కుటుంబ సభ్యులు గమనించి అక్కడికి చేరుకొని నిర్వాహకులతో గొడవకు దిగారు.

ఇరువురు మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో భక్తులు పెద్ద ఎత్తున భూమి కూడా గా నిర్వాహకులు సదరు నగదు పోగొట్టుకున్న కుటుంబానికి కొంత నగదు ఇచ్చి అక్కడ నుంచి జారుకున్నారు. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున నగదు దోపిడికి బాధపడుతున్న జూదం వ్యవహారంపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande