
అమరావతి, 23 జూన్ (హి.స.)
చాగల్లు, కొవ్వూరు మండలం కాపవరం శివారులోని ఓ ప్రైవేట్ పాఠశాల భవనం పైనుంచి దూకి ఏడోతరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటనిది. చాగల్లు ఎస్సై కె.నరేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. కుమారదేవం గ్రామానికి చెందిన ఎన్.ప్రదీప్ రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు భార్య శ్రీదేవి, కుమారుడు రవిచంద్ర(13) ఉన్నారు. రవిచంద్ర కాపవరం శివారులోని తిరుమల పాఠశాలలో ప్రస్తుతం ఏడోతరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల అనంతరం రవిచంద్ర సరిగా పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆదివారం మందలించారు. సోమవారం పాఠశాలకు వచ్చిన రవిచంద్ర తరగతి గదిలో పుస్తకాలు ఉంచి భవనం పైకి వెళ్లి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే రవిచంద్ర మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లి శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ