
నిర్మల్, 23 జూన్ (హి.స.)
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.
అంతరాలయంలోని ఉప ఆలయం ఐన మహాకాళి అమ్మవారి గుడిలోని మహాకాళి అమ్మవారి వెండి కిరీటం, భారీ హుండీని దొంగలు అపహరించారు. అంతే కాకుండా వ్యాస గుహ వద్ద హుండీని పగలగొట్టి నగదును తీసుకుని ఖాళీ హుండీని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. సోమవారం అర్థరాత్రి సమయంలో ఇద్దరు దుండగులు ఆలయంలో గల సీసీ కెమెరాలకు గుడ్డలు కట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆలయంలో ఆరుగురు హోమ్ గార్డులు వీధి నిర్వహణలో ఉన్నా చోరీ జరగడం విశేషం. అమ్మవారి ఆలయంలో చోరీ జరగడం పరిపాటిగా మారింది. గతంలో సైతం హోమ్ గార్డుల నిర్లక్ష్యంతో ఆలయంలోని లడ్డు కౌంటర్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ షర్మిల, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు. ఆలయంలో జరిగిన చోరీ నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన హుండీ లెక్కింపు వాయిదా పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..