
హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
: టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ లక్ష్యఛేదనకు దిగింది. రవి కిరణ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రిషభ్ బస్లాస్ వేసిన రెండో ఓవర్లో సాయి వికాస్ రెడ్డి (1).. బౌలర్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. పార్ధిపన్ వేసిన మూడో ఓవర్లో హైదరాబాద్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేసి 24 పరుగులు రాబట్టాడు. 3 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 32/1. అభిరథ్ (31), అన్విత్ (0) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ