పాఠశాలల్లోనే విద్యార్దులకు. ఆధార్ కార్డు అప్ డేట్
పాఠశాలల్లోనే విద్యార్దులకు. ఆధార్ కార్డు అప్ డేట్
పాఠశాలల్లోనే విద్యార్దులకు. ఆధార్ కార్డు అప్ డేట్


హైదరాబాద్, 23 జూన్ (హి.స.)

, హైదరాబాద్: విద్యార్థులకు పాఠశాలలు మొదలయ్యాయి. చిన్నారులు ఉన్నత చదువులు చదవడానికి ఆధార్ ఎంతో అవసరం. ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేసేందుకు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేలా హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కొత్త కార్యాచరణ చేపట్టింది. ప్రధానోపాధ్యాయుడు కోరిన విధంగా పాఠశాలలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల ఆధార్లో మార్పులు చేసేలా సేవలను ప్రారంబిస్తోంది.

ఏయే సేవలు అందిస్తారు.. ఆధార్ నమోదు, ఫొటోలు, పేర్ల సవరణ, వేలిముద్రలు, చిరునామా, సెల్ఫోన్ నంబర్లు, కొత్త ఆధార్, కేవైసీ అప్డేట్ వంటి మార్పులు చేసుకోవచ్చు. పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థులుంటే సరిపోతుంది.

ఎవరిని సంప్రదించాలి?.. పాఠశాల యాజమాన్యం తమ వద్ద ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుకుంటే ముందుగా జీపీవో అబిడ్స్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. 76590 99628, 94404 54582, 040 23463595 నంబర్లు, cpmhydgpo@gmail.com ద్వారానూ సంప్రదించవచ్చు. 15 రోజుల్లోపు సంబంధిత పాఠశాల పరిసరప్రాంతాల్లో కేంద్రం ఏర్పాటు చేస్తారు.

గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు 8వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. అందులో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande