ప్రైవేటు ఉద్యోగి మద్యం మత్తులో కానిస్టేబుల్ పై.దాడి.ఘటన కృష్ణలంక లో
అమరావతి, 23 జూన్ (హి.స.) కృష్ణలంక, : ఓ ప్రైవేటు ఉద్యోగి మద్యం మత్తులో కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జగ్గయ్యపేటకు చెందిన వేల్పుల సతీష్.. హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న
ప్రైవేటు ఉద్యోగి మద్యం మత్తులో కానిస్టేబుల్ పై.దాడి.ఘటన కృష్ణలంక లో


అమరావతి, 23 జూన్ (హి.స.)

కృష్ణలంక, : ఓ ప్రైవేటు ఉద్యోగి మద్యం మత్తులో కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జగ్గయ్యపేటకు చెందిన వేల్పుల సతీష్.. హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల భవానీపురంలో ఉంటున్న అన్నయ్య ఇంటికి వచ్చారు. ఆదివారం రాత్రి అతని వదిన, సుమారు రెండేళ్ల వయసున్న పాపను విజయవాడ బస్టేషన్లో కారులో దింపి తిరిగి వెళుతున్న క్రమంలో పాప కనిపించడం లేదని అతని వదిన ఫోన్ చేయడంతో మళ్లీ బస్టేషన్ వద్దకు వచ్చి కారును అవుట్గేట్ వద్ద బస్సులు వెళ్లకుండా అడ్డంగా పెట్టారు. దీంతో బయటకు వెళ్లాల్సిన బస్సులు నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న కృష్ణలంక పీఎస్ బ్లూకోటు కానిస్టేబుల్ సురేష్ వచ్చి కారును తీయాల్సిందిగా సూచించారు. దీంతో సతీష్ పాప దొరికే వరకు కారును తీసేదిలేదంటూ పట్టుబట్టి వాదనకు దిగారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన పాప దొరికిందని అతని వదిన చెప్పడంతో ఇప్పటికైనా కారును అడ్డంగా తీయాలనడంతో మళ్లీ వాదనకు దిగారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సురేష్ను నెట్టడంతో అతడు కిందపడగా చేతికి తీవ్ర గాయమైంది. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి నిందితుడు సతీష్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande