నిజామాబాద్ లో ఏసీబీ తనిఖీలు..
నిజామాబాద్ లో ఏసీబీ తనిఖీలు..
Acb


నిజామాబాద్, 23 జూన్ (హి.స.)

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఓ జిల్లా స్థాయి అధికారి ఇంట్లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆయనపై కేసు నమోదైంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఆ శాఖలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. నగరంలోని ప్రగతినగర్ ఎక్సైజ్ సూపరింటెండ్ మాల్లారెడ్డి నివాసం ఉంటున్న ఇళ్లలో ఉదయం నుండే సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు అధికారులు నిర్వహించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉంటున్న ఆయనకు సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీ తనిఖీల్లో మల్లారెడ్డి స్థిర, చరాస్థులకు సంబంధించిన కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande