
శ్రీశైలం, 23 జూన్ (హి.స.):ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు.
అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 45 లక్షల 55 వేల 035 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఈ ఆదాయాన్ని గత 27 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు అలానే అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద గల హుండీ ద్వారా 93 రోజులకు గాను 8,80,396 రాబడిగా లభించింది.
ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 127 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 3 కేజీల 680 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 392, యూఏఈ దిర్హమ్స్10,105, ఆస్ట్రేలియా డాలర్లు 160, యూరోస్ 40, ఒమాన్ బైసాలు100,ఇంగ్లాండ్ పౌండ్స్ 5,మలేషియా రింగిట్స్ 18, సింగపూర్ డాలర్లు 38, సౌదీ రియాల్స్ 17, కెనడా డాలర్లు 10, కత్తారు రియాల్స్ 11, మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి .
పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా ఈ హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV