విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం..
విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం..
విద్యుత్ షాక్తో రైతు దుర్మరణం..


నెల్లూరు, 24 జూన్ (హి.స.)నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది.

గ్రామానికి చెందిన రైతు లింగాలదిన్నె నర్సారెడ్డి (40) విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. సాయంత్రం తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన బోరు మోటార్ స్టార్టర్ను మరమ్మతు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

సాయంత్రం పొలానికి వెళ్లిన నర్సారెడ్డి అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టగా అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో పొలంలోని మోటార్ షెడ్లో ఆయన విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. విద్యుత్ షాక్ కారణంగానే ఆయన మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. నర్సారెడ్డి ఆకస్మిక మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న నర్సారెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande