
పాల్ఘర్ , 25 జూన్ (హి.స.)
మహారాష్ట్రలోని
పాల్ఘర్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నవాధవన్ పోర్టు ప్రాజెక్టు (Vadhvan Port Project) పనుల
వేగానికి ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని రీక్లెమేషన్
జోన్ మరియు దానికి అనుసంధానంగా ఉండే రహదారి నిర్మాణ ప్రాంతంలో ఉన్న ఖాండ్రవనాల్ని
(మ్యాంగ్రోవ్స్) తొలగించడానికిబొంబాయి
హైకోర్టు అనుమతిమంజూరు
చేసింది. జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్
మంజుషా దేశ్పాండేలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ, ఈ మెగా పోర్ట్ ప్రాజెక్ట్
ప్రజోపయోగమైనదని మరియు దేశ ఆర్థిక వృద్ధికి ఎంతో ప్రాధాన్యత కలిగినదని స్పష్టం
చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ కీలక క్లియరెన్స్తో, నేషనల్ హైవే-48తో పోర్టును అనుసంధానించే 8 లేన్ల రహదారి పనుల కోసం దాదాపు 9.24 హెక్టార్ల అటవీ భూమి
వినియోగానికి మరియు 208
మ్యాంగ్రోవ్ చెట్ల తొలగింపునకు మార్గం సుగమమైంది. సుమారురూ. 76,200 కోట్ల వ్యయంతోనిర్మిస్తున్న ఈ వాధవన్ ఓడరేవు
పూర్తయితే, ఇది
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద
నౌకాశ్రయాలలో ఒకటిగా నిలుస్తుంది. పర్యావరణ అనుమతులు మరియు కోర్టు క్లియరెన్స్
రావడంతో ఈ వ్యూహాత్మక ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా 'వాధవన్ పోర్ట్ ప్రాజెక్ట్
లిమిటెడ్ (VPPL)' వేగంగా
అడుగులు వేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi