'ఆపరేషన్ చక్ర-VI': దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 80 చోట్ల సీబీఐ మెరుపు దాడులు
'ఆపరేషన్ చక్ర-VI': దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 80 చోట్ల సీబీఐ మెరుపు దాడులు
cbi


హైదరాబాద్, 25 జూన్ (హి.స.)

దేశవ్యాప్తంగా

కలకలం రేపుతున్న 'డిజిటల్

అరెస్ట్' సైబర్

మోసాల నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) 'ఆపరేషన్ చక్ర-VI' (Operation Chakra-VI) పేరిట

భారీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ వ్యూహాత్మక ఆపరేషన్లో భాగంగా సీబీఐ 60 ప్రత్యేక బృందాలను రంగంలోకి

దించి, దేశంలోని16 రాష్ట్రాల్లో

గల 80కి

పైగా ప్రాంతాల్లోఏకకాలంలో

సమన్వయ శోధనలు (Coordinated Searches) నిర్వహించింది.

ఈ సోదాలు పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలతో పాటు తెలుగు

రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోకూడా జరిగాయి. దాదాపు 200కు పైగా డిజిటల్ అరెస్ట్ మోసాల

కేసులతో సంబంధం ఉన్న ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ను నిర్మూలించే లక్ష్యంతో ఈ దాడులు

చేపట్టారు. ఈ ఆపరేషన్ లో భాగంగా నకిలీ/షెల్ కంపెనీలను స్థాపించడం, సైబర్ నేరగాళ్ల కోసం 'మ్యూల్ బ్యాంక్ ఖాతాలను' (Mule Accounts) తెరిచి

నిర్వహించినందుకు గానుచెన్నై

మరియు కోల్కతా నుండి ఇద్దరు వ్యక్తులనుఅధికారులు అరెస్టు చేశారు.

ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ

మ్యూల్ ఖాతాల ద్వారా దాదాపురూ.

2 కోట్ల

రూపాయలనేరపూరిత

సొమ్మును చేతులు మార్చినట్లు (మనీలాండరింగ్) సీబీఐ గుర్తించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande