
హోస్పేట్, 25 జూన్ (హి.స.)కర్ణాటకలోని హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ హాజరయ్యారు. ముందుగా వారంతా హోస్పేట్లోని ఐఆర్బీ గెస్ట్హౌస్లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం తుంగభద్ర డ్యామ్ సైట్కు వెళ్లి ముగ్గురు ముఖ్యమంత్రులతో సహా కేంద్ర మంత్రి వరుసగా 17, 18, 19, 20వ క్రస్ట్ గేట్లను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే జ్ఞాపికగా శిలాఫలాకాన్ని సైతం ఆవిష్కరించారు. చివరగా సీఎం డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేసి గ్రూప్ ఫొటో దిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV