డ్రగ్స్ రహిత తెలంగాణే మన లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణే మన లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
Cm


హైదరాబాద్, 26 జూన్ (హి.స.)

అంతర్జాతీయ యాంటీ-డ్రగ్స్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి

(CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు, యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువతలో సానుకూల ఆలోచనలు, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా మాత్రమే మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించగలమని ఆయన స్పష్టం చేశారు.

మాదక ద్రవ్యాల మహమ్మారి కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా, వారి నమ్ముకున్న కుటుంబాలను సైతం పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సంస్కృతి వల్ల సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా.. అది శాంతిభద్రతల (Law and Order) సమస్యలకు కూడా దారితీస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణ, వాటి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సమాజంలో విస్తృత అవగాహన, అప్రమత్తతతో పాటు ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'డ్రగ్ ఫ్రీ ' (Drug-Free Telangana) తెలంగాణ లక్ష్యసాధనలో యువత, తల్లిదండ్రులు, పౌర సమాజం భాగస్వాములై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande