
హైదరాబాద్, 26 జూన్ (హి.స.)
బంగారం అక్రమ రవాణాపై కేంద్ర
ఇంటెలిజెన్స్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో ఎయిర్పోర్టులు, ఓడరేవులు, ప్రధాన బస్టాండ్లలో ఆక్మసిక తనిఖీలు చేపట్టాలని వివిధ నిఘా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఇద్దరు ప్రయాణికుల కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. అనంతరం వారి ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేక పౌచ్లలో దాచిన 2.271 గోల్డ్ను పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ బహిరంగ మార్కెట్లో రూ.4.5 కోట్ల విలువ ఉంటుందని కస్టమ్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..