
నెల్లూరు , 26 జూన్ (హి.స.) మతసామర్యానికి ప్రతీకగా ఏటా మొహర్రం నెలలో నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఈ రోజు రాత్రి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఐదురోజులపాటు జరిగే ఈ పండుగ కోసం నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలిరోజు రాత్రి సందల్మాల్, రేపు అర్ధరాత్రి బారాషహీద్ల గంథ మహోత్సవం జరుగుతుంది
మత సామరస్యానికి ప్రతీకైన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ నేటి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. కోరికలు నెరవేర్చుకోవడానికి స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి భక్తులు రానున్నారు. ఈ పండుగ సందర్భంగా దాదాపు 20 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర పండుగ కోసం సర్కార్ పటిష్ట ఏర్పాట్లు కూడా చేసింది. ఇవాళ చందల్మౌళి కార్యక్రమం ఉండగా... 27వ తేదీన గంధం ఉంటుంది. 28వ తేదీన రొట్టెల పండుగ నిర్వహిస్తారు. 29వ తేదీన తహలీల్ ఫఫాతే, జూన్ 30వ తేదీన ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రొట్టెల పండుగ నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా ఏపీ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV