మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
డిల్లీ, 28 జూన్ (హి.స.: ప్రధాని నరేంద్రమోడీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. షీషెల్స్ ప్రభుత్వం అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్’’(Guardian of the Blue Horizon) అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్
Award


డిల్లీ, 28 జూన్ (హి.స.: ప్రధాని నరేంద్రమోడీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. షీషెల్స్ ప్రభుత్వం అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్’’(Guardian of the Blue Horizon) అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి , వాతావరణ మార్పులు నియంత్రణలో నాయకత్వానికి గానూ ఈ అవార్డు ప్రదానం చేసింది. ఈ అవార్డు ద్వారా పర్యావరణ పరిరక్షణ, బ్లూ ఎకానమీ, సుస్థిర అభివృద్ధి, సముద్ర వనరుల బాధ్యతాయుత వినియోగం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యల్లో మోదీ చూపిన నాయకత్వాన్ని సీషెల్స్ ప్రభుత్వం ప్రశంసించింది. చిన్న ద్వీప దేశాల అభివృద్ధి, వాతావరణ స్థిరత్వం కోసం భారత్ అందిస్తున్న సహకారాన్ని సీషెల్స్ ప్రభుత్వం ప్రస్తావించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande