
కోల్కతా , 28 జూన్ (హి.స.)తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి. తామే అసలైన టీఎంసీ అని నిరూపించుకోవడానికి ఇరు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఒకవైపు రెబల్స్ క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు మమతా బెనర్జీ ప్రధాన అనుచరులైన 'కాళీఘాట్ వర్గం' వారిపై చట్టపరమైన చర్యలకు దిగింది.
ఇటీవలే రెబల్ వర్గానికి చెందిన ముఖ్య నేతలు కోల్కతాలో సుమారు 50 మంది మాజీ టీఎంసీ కౌన్సిలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి క్యాడర్ను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ఈ క్రమంలోనే రెబల్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ఒక అడుగు ముందుకు వేసి, అధికారిక 'ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' లెటర్హెడ్పై తనను తాను చైర్పర్సన్గా పేర్కొంటూ జూలై 21న జరగబోయే భారీ ర్యాలీ అనుమతి కోసం కోల్కతా పోలీసులకు లేఖ రాశారు.
ఈ పరిణామాలపై మమతా బెనర్జీ విధేయులైన కాళీఘాట్ వర్గం తీవ్రంగా స్పందించింది. టీఎంసీ ఎంపీ డోలా సేన్ న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో రెబల్స్ నకిలీ లెటర్హెడ్లు సృష్టించారని, పార్టీ పదవులను అక్రమంగా వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఫోర్జరీ, తప్పుడు గుర్తింపుతో మోసం చేయడం (ఇంపర్సనేషన్), పార్టీ లోగోను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi