
న్యూఢిల్లీ, జూన్ 29 (హి.స)
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నేషనల్ అంబులెన్స్ సర్వీసెస్ మార్గదర్శకాలు 2026 ను అధికారికంగా విడుదల చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య రవాణాకు ఒకే విధమైన జాతీయ ప్రమాణాలు అమలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అత్యవసర ప్రతిస్పందనను మరింత వేగవంతం చేయడానికి అంబులెన్స్ సేవలను యూనిఫైడ్ ఎమర్జెన్సీ నెంబర్ 112 తో అనుసంధానించనున్నారు. జీపీఎస్ ఆధారిత అంబులెన్స్ ట్రాకింగ్, కాల్ లాగింగ్ సిస్టమ్స్, కమాండ్ అండ్ డిస్పాచ్ సెంటర్ల ఏర్పాటు ఈ కొత్త విధానంలో భాగం కానున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ఆసుపత్రులలో బెడ్ల లభ్యతను సులభంగా తెలుసుకునేలా జీఐఎస్ మ్యాపింగ్ నిర్వహిస్తారు. రోగిని సురక్షితంగా తరలించడం, ముందస్తు ప్రాథమిక చికిత్స అందించడం కోసం అంబులెన్స్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi