భారతీయ కళ, సంస్కృతిని భావితరాలకు అందించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
భారతీయ కళ, సంస్కృతిని భావితరాలకు అందించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally


హైదరాబాద్, 30 జూన్ (హి.స.)

భారతీయ కళ, సంస్కృతిని భావి తరాలకు అందించాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ సాంస్కృతిక విభాగం, ఒడిశా సాంస్కృతిక శాఖల సౌజన్యంతో కళాకృతి నృత్యాలయ నిర్వహణలో యాదాద్రి జాతీయ నృత్యోత్సవం జూలై 25, 26 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు యాదాద్రి డాన్స్ ఫెస్టివల్ చైర్మన్ బీఆర్ విక్రమ్ కుమార్, డైరెక్టర్ భారతి వెల్లడించారు.

ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు యాదాద్రి నృత్యోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, కళలను, కళారూపాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. డైరెక్టర్ భారతి మాట్లాడుతూ, భరతనాట్య దిగ్గజం, పద్మశ్రీ, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గీతా చంద్రన్కు యాదాద్రి జాతీయ ఎక్స్ లెన్స్ అవార్డును జూలై 25న ప్రదానం చేసి సత్కరిస్తున్నట్లు తెలిపారు. అలాగే, హైదరాబాద్ నాట్యాంజలి పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ నృత్యకారులు పలు అంశాల పై విశిష్ట నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు భారతి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande