
నిర్మల్, 30 జూన్ (హి.స.)
ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల
పై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని నిర్మల్ జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ఎలా చేస్తారని ఏఈఓను ప్రశ్నించి స్వయంగా కలెక్టర్ ఆధార్ కార్డు నంబర్ తో చేయించి పరిశీలించారు.
కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఒక రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తిచేయవచ్చని నిర్మల్ జిల్లాలో కేవలం 70 శాతం మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయిందని మిగతా రైతుల ప్రక్రియ ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన డీఎఓను ప్రశ్నించారు. కొంతమంది రైతులు అందుబాటులో లేకపోవడం ఓటీపీ చెప్పకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ కలెక్టర్ కు తెలిపారు. కాగా లోకేశ్వరం మండలంలో 90 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారి గిరిరాజ్ కలెక్టర్ కు నివేదికలు సూచించారు. మిగతా రైతులు మరణించడం గాని రెండు చోట్ల వ్యవసాయ భూములు ఉండడం వల్ల పూర్తి కాలేదని అన్నారు. ఇకనైనా ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి నిర్మల్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..