
చండీఘడ్, 06 జూన్ (హి.స.)
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. కాగా రాహుల్కు ఇది టెస్టుల్లో 12వ సెంచరీ కావడం విశేషం. అయితే సెంచరీ కొట్టిన వెంటనే రాహుల్ ఔటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిలకడగా ఆడుతోంది. లంచ్ సమయానికి ఇండియా 96 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ టీ విరామ సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 209 రన్స్ చేసింది. ఉదయం ఇన్నింగ్స్ లో జైస్వాల్ 24 రన్స్ చేసి, రెండో సెషన్లో సాయి సుదర్శన్ 81 రన్స్ చేసి నిష్క్రమించారు. ఇక మూడవ సెషన్లో రాహుల్ ఔటయ్యాడు. ముల్లాన్పూర్లో జరుగుతున్న టెస్టులో సెకండ్ డౌన్లో వచ్చిన కెప్టెన్ గిల్ వేగంగా స్కోరు చేస్తున్నాడు.
కేఎల్ రాహుల్ తొలుత జైస్వాల్, ఆ తర్వాత సాయి సుదర్శన్, గిల్తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్లతో 100 రన్స్ చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. 60.6 స్ట్రయిక్ రేట్తో అతను బ్యాటింగ్ చేశాడు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..