భారత్ - ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్.. సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్.
భారత్ - ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్.. సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్.
క్రికెట్


చండీగఢ్, 07 జూన్ (హి.స.)

భారత్, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా(Team India) లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 14 నాటౌట్, 2 ఫోర్లు), మానవ్ సుతార్(20 బంతుల్లో 9 నాటౌట్, 2 ఫోర్లు) ఉన్నారు.

తొలి రోజు భారీ ఆధిక్యంతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. కాస్త తడబడింది. తొలి సెషన్లోనే వరుస ఓవర్లలోనే రిషభ్ పంత్(81), ధ్రువ్ జురెల్(19) పెవిలియన్ చేరారు. శనివారమే సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ (177 బంతుల్లో 126, 15ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి రెండో రోజు ఔటయ్యాడు. సలీమ్ సాఫి 4, రెహమాన్ షరీఫీ 1, హష్మతుల్లా షాహిది 1 వికెట్ పడగొట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande