ఆఫ్ఘనిస్తాన్ను దెబ్బతీసిన ఇండియన్ స్పిన్నర్లు.. ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో భారీ విజయం
ఆఫ్ఘనిస్తాన్ను దెబ్బతీసిన ఇండియన్ స్పిన్నర్లు.. ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో భారీ విజయం
Cricket


చండీగఢ్, 08 జూన్ (హి.స.)

భారత్తో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడింది. న్యూ చండీఘడ్లో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో భారత్ భారీ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 112 పరుగులకే ఆలౌటైంది. ఇవాళ మూడవ రోజు 14 వికెట్లు పడ్డాయి. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ 564 రన్స్ చేయగా, ఆఫ్ఘనిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 152 రన్స్కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లు తీసి ఆఫ్ఘన్ బ్యాటర్లను దెబ్బతీశాడు.

అయితే రెండో ఇన్నింగ్స్ ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘనీలు మరీ దారుణంగా చేతులెత్తేశారు. టాపార్డర్ బ్యాటర్ల దాదాపు విఫలం అయ్యారు. ఓపెనర్ అటల్ 42, గుర్బాజ్ 24 రన్స్ చేశారు. 412 పరుగులు వెనకబడి ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత స్పిన్నర్లు సత్తా చాటారు. ఆఫ్ఘనిస్తాన్ కేవలం 35.3 ఓవర్లలో తన రెండో ఇన్నింగ్స్ 112 రన్స్ చేసి ఆలౌటైంది.

మూడో రోజు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్ సుందర్ 4, కుల్దీప్ మూడు వికెట్లు తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande