రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగం కేసు.. సిట్ పరిధి, గడువు పెంపు
రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగం కేసు.. సిట్ పరిధి, గడువు పెంపు
Ayodhya


అయోధ్య, 01 జూలై (హి.స.)

అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ 2 (Ram Mandir Donation Embezzlement) కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ అక్రమ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందానికి (SIT) నేటితో సమయం ముగిసింది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో 15 రోజుల అదనపు గడువు పొడిగించింది. అలాగే ఈ కేసులో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు, దర్యాప్తు పరిధిని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ స్కామ్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్క కోణాన్ని నిష్పక్షపాతంగా విచారించనున్నట్లు ఎస్ఐటీ స్పష్టం చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే యూపీ పోలీసులు తీవ్రస్థాయిలో దర్యాప్తు చేపట్టి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా, అయోధ్య కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఈ నిధుల అవకతవకల ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్య ట్రస్టీ అనిల్ మిశ్రా ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం పోలీసులు చంపత్ రాయ్ను సుదీర్ఘంగా ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో దాదాపు రూ.80 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ పరిధి ఇప్పుడు బ్యాంకింగ్ లావాదేవీల వైపు కూడా విస్తరించడంతో ఈ 15 రోజుల అదనపు గడువులో సిట్ మరిన్ని కీలక నిజాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande