సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి.. కామారెడ్డి జిల్లా ఎస్పీ
సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి.. కామారెడ్డి జిల్లా ఎస్పీ
Sp


కామారెడ్డి, 14 జూలై (హి.స.) కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర మంగళవారం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది రోల్కాల్ను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల పై సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించే ప్రతి బాధితుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించి, ప్రజలకు పోలీస్ శాఖ పై మరింత విశ్వాసం కలిగేలా ప్రతి అధికారి బాధ్యతగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని స్పష్టం చేశారు. స్టేషన్లో నమోదైన ప్రతి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నాణ్యమైన దర్యాప్తు ప్రమాణాలను పాటిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ ప్రాపర్టీ భద్రత పై,ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను చట్టపరమైన నిబంధనల ప్రకారం భద్రపరచాలని, వాటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande