కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి.. మంత్రి అడ్లూరి
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి.. మంత్రి అడ్లూరి
Minister


జగిత్యాల, 14 జూలై (హి.స.) కాంగ్రెస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా

మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఇటీవల ప్రకటించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బుర్ర రాములు గౌడ్, కార్యదర్శిగా ఎంపికైన సతీష్ రెడ్డిని మంత్రి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

పదవులు రాని వారు నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande