
చిలకలూరిపేట గ్రామీణం : పల్నాడు జిల్లా చిలకలూరిపేట, 16 జూలై (హి.స.)
గ్రామీణం ఠాణా పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గంజాయి విక్రయిస్తూ పలుమార్లు పట్టుబడిన కారసాని శివప్రసాద్రెడ్డిపై పీఐటీఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకున్న గ్రామీణ సీఐ సుబ్బానాయుడు, ఎస్సై అనిల్కుమార్ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ