
అమరావతి, 16 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలుసెప్టెంబర్లోప్రారంభం కానున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఆ తర్వాత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ప్రాధమికంగా ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. డోర్ టూ డోర్ క్యాంపెయిన్ ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జోనల్ కోఆర్డినేటర్లు, పార్టీ నేతల సమావేశంలో టీడీపీ అగ్రనేతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న నియామక పదవులన్నింటిని వెంటనే భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ