గోల్కొండలో బోనాల జాతర.. బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ (update)
గోల్కొండలో బోనాల జాతర.. బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ
Minister


హైదరాబాద్, 16 జూలై (హి.స.)

చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గురువారం లంగర్ హౌస్లో ఏర్పాటు చేసిన వేదిక పై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖకు బోనం ఎత్తారు. అనంతరం శ్రీ గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు పట్టువస్త్రాలు, మొదటి 'బంగారు బోనం' సమర్పించారు. 11 లక్షల రూపాయల చెక్కును అందించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీర విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక జోష్తో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వీహెచ్ హనుమంతరావు, మెట్టు సాయి కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ చంద్ర శేఖర్ తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande